జాతకుడు బాగుండాలంటే, జాతకుని యొక్క తనూ భావము (లగ్నము) బాగుండాలి. తనూ భావము బాగుండాలంటేవ్యయ స్థానము (౧౨వ భావము) బాగుండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యయము చేయగలగాలంటే బాగాలాభాలు లేదా సంపాదన బాగుండాలి. అంటే లాభ స్థానము (౧౧వ భావము) బాగుండాలి. లాభాలు లేదా సంపాదనబాగుండాలంటే వృత్తికి సంబందించిన ౧౦వ భావము బాగుండాలి. వృత్తి అనగా, వ్యాపారము కావచ్చు, ఉద్యోగముకావచ్చు, నైపుణ్యము కావచ్చు. దశమ భావము బాగుండాలంటే, అందుకు అతడు లేదా అతని తల్లిదండ్రులు ఎంతోపుణ్యము చేసుండాలి. ఇందుకు నవమ భావము బాగుండాలి. నవమ భావము బాగుండాలంటే, జాతకుడు ఎంతోకష్టపడాలి, ఇబ్బందులను ఎదుర్కోవాలి. దీనికి అష్టమ భావము (ఆకస్మిక ధన లాభము, స్పెకులేషన్ మొ. కూడా) బాగుండాలి. అష్టమ భావము బాగుండాలంటే సప్తమ భావము (కళత్రము, సంబందాలు, రిలేషన్స్) బాగుండాలి. సప్తమ భావము బాగుండాలంటే శత్రు, రోగ, ఋణ స్థానము (౬వ భావము) బాగుండాలి. అందుకు జాతకుని యొక్కఆలోచన సరళి, సంతానము (పంచమ భావము) బాగుండాలి. అందుకు తల్లి ప్రేమ, సౌఖ్యము, విద్య, ఆహారనియమాలు మొ. (చతుర్ధ భావము) తోడ్పడుతుంది. దానికి అందరి సహకారము (తృతీయ భావము) కావాలి. సహకారము పొందాలంటే ధనము, మంచి వాక్కు (ద్వితీయ భావము) కలిగి ఉండాలి.
ద్వాదశ భావాలలో ఒక భావమునకు మరొక భావమునకు అంతర సంబందము (inter-link) కలిగి ఉంటుంది. కావునజాతకులు మంచి వాక్కు, నడవడి, ప్రవర్తన కలిగి ఉండవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి